అర్ధనారీశ్వరుడంటే ఎవరు , ఆపేరు ఎలా వచ్చింది ?

అర్ధనారీశ్వరుడంటే ఎవరు , ఆపేరు ఎలా వచ్చింది ? పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది .... thumbnail 1 summary
అర్ధనారీశ్వరుడంటే ఎవరు , ఆపేరు ఎలా వచ్చింది ?

పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది . తలనుండి కాలి బొటనవేలివరకూ సమానము గా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ , ఆడ రూపాలు ఒకటిగా ఉండడము . అర్ధ (సగమైన ) నారి (స్త్రీ) , ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది . తల ఆలోచనకి , పాదము ఆచరణికి సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట . 
లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా సెరిగగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది . 
పరమేశ్వరుని , అంబికను ఏకభావముతో , భక్తితో సేవించాలి . అప్పుడే అధిక శుభము కలుగుతుంది . ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి .
అర్ధనారీశ్వరుడు:
లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ) గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ) గా పండితులు చెబుతారు. 
ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. 
అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళచతుర్ధశి రోజైన మహాశివరాత్రి నాడు 
ఆది దంపతులు - జగత్పితరులు:
'జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' అని స్తుతిస్తుంటారు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులలాంటి వారు ఆ పార్వతీపరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కన్పించటం కూడా అందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమ శక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వ భాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగనాత్మను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది. 
సృష్టి ఆవిర్భావం:
స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీ మూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు, ఆదిపరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథాసందర్భం వివరిస్తుంది. అంతేకాక స్థితి, లయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేక పోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు. 
లోకంలో సహజం గా వినిపించే మాట పురుషుడే అధికుడని . శంకరుని విషయములో అది సరికాదు . శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు . పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి -- శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని బూడిదమాత్రమే ఒంటికి పూసుముటాడని , ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని , నిత్యము బిక్షకోసము తిరుగుతూ ఉంటాడని , బిక్షపాత్రకూడా లేని కారణముగా పర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని ... ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకేఒక్క ప్రియుడు శంకరుడు . లోకములో ప్రేముకులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా.
తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు . ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సాంకేతం , ఆమె పెట్టే అన్నము జ్ఞానాని సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది " జ్ఞాన (అన్న) భిక్ష " తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు . అందుకే 
" అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !. అంటుంది శ్లోకము . 

Why is the Day starts with midnight only, అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?

Why is the Day starts with midnight only, అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది? అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థ... thumbnail 1 summary
Why is the Day starts with midnight only, అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?

అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థరాత్రి జన్మదినోత్సవాలు, ఇలా అర్థరాత్రితోనే మనరోజు ఎందుకు ప్రారంభమవుతుందీ అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అదేమిటి పిచ్చి ప్రశ్న అని కొట్టెయ్యకుండా, అది ఇంగ్లీషువారి పద్ధతిలే అని దాటెయ్యకుండా ఆలోచిస్తే ఒక కొత్త విషయం బయటకు వస్తుంది! 
నిజానికి ఏ తెల్లవాడికైనా అర్థరాత్రి తోనే రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? విద్యుత్తు దీపాలు కూడా లేని నాడు, కనీసం గడియారాలు కూడా లేని నాడు, అర్థరాత్రికి ఎవడూ మేలుకుని వుండని నాడు, దానితో రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? 
వైదీకకాలంలో అంటే బౌద్ధమతానికి కూడా పూర్వకాలంలో ప్రపంచంలో మతం అన్న మాట కూడా లేని కాలంలో, ఒకే ఒక ధర్మం వుండేదట. అదే భారతీయ లేక వైదీక సనాతనధర్మం. అది భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతటా వ్యాపించి వుండేదిట. భారతదేశం ఈ వైదీకసంస్కృతికి ఒక రకంగా నాయకత్వం వహించేది అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ, జైన మతాలవంటివి పుట్టి అమిత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆదిశంకరుడు మళ్ళీ మన మతాలను ఉద్ధరించి సనాతనధర్మాన్ని పునఃస్థాపితం చేసాడు. ఆ తరువాత ఇంకా అనేక మతాలు విడివిడిగా జన్మించి, అలా ఒక్కొక్కరికి ఒక మతం వచ్చేసాక, ఇక ఈ వైదిక ధర్మాన్ని ఏమని పిలవాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు, అదే కాలంలో భారతీయులని హిందూ దేశస్తులని పర్షియన్లు పిలవడం మొదలు పెడితే, అదే పేరుని పెట్టి మన మతాన్ని కూడా పిలవడం మొదలు పెట్టారు. అలా మనకు హిందూమతస్తులని పేరు పడిపోయింది కానీ, వైదీక సనాతనధర్మానికి నిజంగా పేరు లేదు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సనాతనధర్మం వల్ల భారతదేశం ప్రపంచానికి ఒక సాంస్కృతికరాజధానిగా వుండేది. అలా ఆ కాలంలో అందరూ వైదీకకాలమానాన్ని అనుసరించేవారు. భారతీయ సంస్కృతిని గౌరవించి పాటించేవారు అని చెప్పుకోవచ్చు. 
ఇలా వైదీక పద్ధతిని అనుసరించడానికి ప్రపంచం కట్టుబడి వుండేదన్న విషయం అంగీకరిస్తే, దినారంభం గురించి ఆలోచించడానికి పునాది సిద్ధమైందన్నమాట. -- ఇందాక చెప్పుకున్నట్లు సూర్యోదయమైతేగానీ, భారత పంచాంగం ప్రకారం రోజు మొదలవ్వదు. సామాన్యంగా భారతదేశంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అంటే యూరప్ దేశవాసులు మంచి నిద్రలలో ఉంటారన్నమాట. అంటే గడియారాలు గట్రా లేని కాలంలో ... " ఎప్పుడో అర్థరాత్రికి వైదీకదినం మొదలవుతుందిలే" ... అని అనుకునేవారు. అంటే మన పంచాంగ పట్ల, లేక భారతీయ సంస్కృతిపట్ల వున్న అభిమానంతో, భారత దేశంలో రోజు ఎప్పుడు మొదలు అయితే, అప్పుడే యూరోపియన్లు కూడా తమ రోజును అదే సమయానికి, …. అంటే అది అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా, …. … అదే సమయానికి తమతమ రోజులను మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారన్న మాట. ఈ విధంగా ఇలా అర్థరాత్రికి వారి దినం మొదలు పెట్టుకునే సాంప్రదాయాన్ని అలవరుచుకున్నట్లుగా కనపడుతున్నది. మనపంచాంగం ప్రకారం స్థానికకాలమానంతో సంబంధంలేకుండా ఎక్కడైనా తిథులను ఇలాగే ఒకే సమయంలో అమలు పరుచుకోవడం కూడా సాంప్రదాయమే. దానినే వీరు దినారంభానికి కూడా వర్తించినట్ట్లు తెలుస్తోంది. 

అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి?

అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి? సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు, పురుగుల బారి నుంచి రక్షించుకోవడాని... thumbnail 1 summary
అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి?



సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు, పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి అంతో ఇంతో ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అలా అరటి కాయ తన లోపల ఎన్నో రక్షక రసాయనాలను (preservatives) సహజంగానే సంతరించుకుని ఉంటుంది. ఇందులో ఫినాలు తరహా రసాయనాలు, ఇనుము, కాపర్‌ లవణాలు ఉంటాయి. మనం అరటికాయ పచ్చని తోలును చీల్చినప్పుడు అందులోంచి ఈ రసాయనాలు కొంచెం జిగురుగా రావడాన్ని గమనించవచ్చు. ఇవి మన చేతులకు కానీ, బట్టలకు కానీ అంటుకుంటూనే బయటి వాతావరణానికి బహిర్గతమవుతాయి. వెంటనే ఇవి గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీకరణం(oxidise) చెందుతాయి.

ఉదాహరణకు ఫినాళ్లు ఆక్సీకరణం చెందితే అవి క్వినోన్లు అనే పదార్థాలుగా మారతాయి. అలాగే లోహ లవణాలు (metal salts) కొన్ని వాటి ఆక్సైడులుగా మారతాయి. ఫినాళ్లకు దాదాపు రంగు ఉండదు. కానీ క్వినోన్లకు ముదురు రంగులు ఉంటాయి. అరటి తొక్క జిగురు చేతికి అంటుకున్నప్పుడు అందులోని ఫినాళ్లు గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో రంగుగల క్వినోన్లుగా మారడం వల్లనే మచ్చలు (కర్రులు) ఏర్పడుతాయి.

Palms are red in color on focus of light of torch-Why, అరచేయి వెలుగులో ఎర్రనేల?

Palms are red in color on focus of light of torch-Why, అరచేయి వెలుగులో ఎర్రనేల? ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల మనుషుల చర్మం వివిధ వర్ణాల్ల... thumbnail 1 summary
Palms are red in color on focus of light of torch-Why, అరచేయి వెలుగులో ఎర్రనేల?


ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల మనుషుల చర్మం వివిధ వర్ణాల్లో ఉంటుంది. కొందరు కారు నలుపైతే, కొందరు చామనఛాయలోను, గోధుమరంగు, తెలుపు రంగుల్లో ఉంటారు. ఇందుకు కారణం వారి చర్మపు పొరల్లో కాంతి నుంచి, ఉష్ణం నుంచి శరీరాన్ని కాపాడే మెలనిన్‌ అనే వర్ణద్రవ్య(pigment)రేణువులు వివిధ మోతాదుల్లో ఉండడమే. అయితే చర్మం రంగు ఏదైనా అందరి అరచేతులు, అరికాళ్లు మాత్రం దాదాపు తెల్లగానే ఉంటాయి. దీనికి కారణం వాటి చర్మంలో మెలనిన్‌ రేణువులు లేకపోవడమే. అందువల్ల ఆ చర్మాలు దాదాపు పారదర్శకం (transparent)గా ఉంటాయి.

ఇలా పారదర్శకంగా ఉండే అరచేతి చర్మం మీదకు టార్చిలైటు వేసినప్పుడు బలమైన కాంతి అరచేతి చర్మంగుండా ప్రసరించి చర్మం కిందున్న దట్టమైన రక్తకేశనాళికల దగ్గర పరావర్తనం చెందుతుంది. రక్తకేశనాళికలు దట్టంగా దారపు పోగుల్లాగా, ఎర్రగా ఉండడం వల్ల అక్కడ పరావర్తనం చెందిన కాంతి అరచేతి చర్మపు పైపొరకున్న గరుకుదనం (unevenness) వల్ల వివిధ దిశల్లోకి వెదజల్లబడుతుంది (scattered). అరచేతి చర్మం కిందున్న రక్తకేశనాళికలు చాలా మటుకు ఎరుపు రంగు కాంతినే ప్రతిబింబిస్తాయి కాబట్టి టార్చిలైటు వేసినప్పుడు అరచెయ్యి ఎర్రగా కనిపిస్తుంది.

There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?

There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు? చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల... thumbnail 1 summary
There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?


చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి. 
వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు. 

Why do Magnets attracts iron only, అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?

Why do Magnets attracts iron only, అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు? బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థ... thumbnail 1 summary
Why do Magnets attracts iron only, అయస్కాంతాలు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తాయెందుకు?


బాహ్య అయస్కాంతాల పట్ల ప్రవర్తించే తీరును బట్టి పదార్థాలను మూడు తరగతులుగా విభిజిస్తారు. అవి

1. డయాస్కాంత(dia-magnetic),
2. పరాయాస్కాంత (paramagnetic),
3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు.

డయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం వికర్షిస్తుంది. అయితే ఈ వికర్షణ బలం చాలా స్వల్పం కాబట్టి మనం గుర్తించలేక ఆకర్షించడం లేదనే భావిస్తాము. నీరు, రబ్బరు, చక్కెర, ఉప్పు వంటివి ఇందుకు ఉదాహరణలు. ఇక పరాయాస్కాంత పదార్థాలను బాహ్య అయస్కాంతం స్వల్పంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ బలం కూడా అతి స్వల్పంగా ఉండడంతో మనం వాటిని కూడా అయస్కాంతం ఆకర్షించదనే అనుకుంటాము. ఇందుకు ఉదాహరణ రక్తం, మైలతుత్తం, కొబాల్టు క్లోరైడు, ఆక్సిజన్‌, మాంగనీస్‌ సల్ఫేటు మొదలైనవి. ఇక మూడో రకమైన ఫెర్రో అయస్కాంత పదార్థాలను మాత్రమే అయస్కాంతం బలీయంగా ఆకర్షిస్తుంది. వీటిలో కేవలం ఇనుమే కాదు, క్రోమియం ఆక్సైడు, క్రోమియం, నికెల్‌ లోహాలు కూడా ఉన్నాయి. పదార్థాలలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఏమాత్రం లేకుండా అన్నీ జతలుగా ఉంటే అవి డయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. అణువుకో, పరమాణువుకో ఒకటో, రెండో జతకూడని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్న పదార్థాలు పరాయాస్కాంత ధర్మాలను ప్రదర్శిస్తాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడమే కాకుండా అవన్నీ కవాతు చేసే సైనికుల్లా ఒకే దిశలోకి మళ్లగలిగే పదార్థాలు ఫెర్రో అయస్కాంత పదార్థాలు అవుతాయి.

Why do Magnets attracts iron only,Why do Magnets attracts iron only, in telugu, magnets attracts iron.

What is Magnetic Flus, అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?

What is Magnetic Flus, అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి? ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష... thumbnail 1 summary
What is Magnetic Flus, అయస్కాంత ఫ్లక్స్‌ అంటే ఏమిటి?

ఒక వస్తువును మరో వస్తువు ప్రభావితం చేసేందుకు రెండే పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షంగా యాంత్రిక బంధాన్ని ఏర్పరుచుకోవడం. రెండు అవి ప్రదర్శించే క్షేత్ర ఫలితాల (field effects) ద్వారా ప్రభావితం కావడం. మనం సైకిల్‌ తొక్కినా, కలం పట్టుకుని రాసినా అది యాంత్రిక బంధమే అవుతుంది. కానీ ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే సూర్యుడు తన చుట్టూ భూమిని తిప్పుకునేలా ప్రభావం కలిగించడం యాంత్రిక బంధం కాదు. అది గురుత్వ క్షేత్ర ఫలితం. అలాగే ఒక అయస్కాంతం మరో అయస్కాంతాలన్ని తాకకుండానే ప్రభావం చూపగలదు. ఇది అయస్కాంత క్షేత్ర బలం. యాంత్రిక బంధం లేకుండా ఒక వస్తువు మరో దానిపై ప్రభావం చూపుతోందంటే గురుత్వ, అయస్కాంత, విద్యుత్‌ క్షేత్రాల ప్రభావం ఉన్నట్టే. క్షేత్ర తీవ్రతను బలరేఖల (lines of force) ద్వారా పరిగణిస్తారు. నిర్ణీత వైశాల్యం నుంచి నిర్దిష్ట దిశలో ప్రసరించే క్షేత్ర బలరేఖల సంఖ్యను ఆ క్షేత్రపు ఫ్లక్స్‌ (flux) అంటారు.

Magnetic field telugu,magnetic flex,What is Magnetic Flus,Magnetic field,physics,magnet field in telugu.

Maganetic Man Story-What, అయస్కాంత తాతయ్య కధ ఏవిటి?

Maganetic Man Story-What, అయస్కాంత తాతయ్య కధ ఏవిటి? అయస్కాంతానికి దగ్గరగా ఓ ఇనుప వస్తువును తీసుకెళితే ఏమవుతుంది? లటుక్కున అతుక్కుపోతుం... thumbnail 1 summary
Maganetic Man Story-What, అయస్కాంత తాతయ్య కధ ఏవిటి?



అయస్కాంతానికి దగ్గరగా ఓ ఇనుప వస్తువును తీసుకెళితే ఏమవుతుంది? లటుక్కున అతుక్కుపోతుంది కదా. ఆ తాతయ్య దగ్గరకి తీసుకెళ్లినా అంతే! అందుకే ఆయన్ని 'అయస్కాంత మనిషి' అంటారంతా. ఇంతకీ ఏమిటి ఈయనగారి కథ?

మీరు మలేషియా వెళ్లి 'మ్యాగ్నెటిక్‌ మేన్‌' తెలుసా అని ఎవరినైనా అడగండి. 'ల్యూతో లిన్‌ కదా? ఎందుకు తెలియదు?' అని ఎదురు ప్రశ్నిస్తారు. ఆయన అంత ప్రముఖుడు మరి. ఈ 78 ఏళ్ల అయస్కాంత తాతయ్య దగ్గరకి చెంచాలు, రేకులు, కడ్డీలు, ఇస్త్రీ పెట్టెలు ఇలా ఏ ఇనుప వస్తువైనా తీసుకెళ్తే చటుక్కున అంటుకుపోతుంది. అందరూ సరదాగా 'హలో.. మిస్టర్‌ మాగ్నట్‌' అంటారందుకే. ఈ శక్తి లిన్‌కే కాదు, ఆయన ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనుమలకి కూడా ఉంది.

చెంచాలే కాదు 36 కిలోల బరువున్న ఇనుప వస్తువులు కూడా ఆయనకి అతుక్కుని ఊడిరావు. లిన్‌ తాతయ్య ఒంటికి కొక్కెం ఉన్న రేకును అతికించి, ఆ కొక్కేనికి ఇనుప గొలుసు తగిలించి, రెండో కొసను బస్సులకి, కార్లకి తగిలించినా లాగేస్తాడు! ఇంతకీ ఈయన శరీరానికి నిజంగానే అయస్కాంత శక్తి ఉందా? లేదనే చెబుతున్నారు ఈయనపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు. ఈయన శరీరానికి ఇనుప వస్తువుల్ని పీల్చుకునే గుణం ఉందిట. లిన్‌ తాతయ్య మంచి వాడు కూడా. తనకున్న ఈ శక్తితో ప్రదర్శనలు చేసి ఆ డబ్బుని బడుగులకి విరాళంగా ఇస్తాడు.

magnetic man,magnetic man story in telugu,magnet grand father,magnet,physical science.

Do all bacteria spread from one to another, అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా?

Do all bacteria spread from one to another, అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా? హాని కలిగిస్తున్నామా, మేలు చేస్... thumbnail 1 summary
Do all bacteria spread from one to another, అన్ని రకాల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా?



హాని కలిగిస్తున్నామా, మేలు చేస్తున్నామా అనే విషయం ఆయా సూక్ష్మజీవులకు తెలీదు. వాటి మానాన అవి జీవిస్తుంటాయి. ఇక ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది వాటి జీవన విధానంలో ఒక భాగమే. సాధారణంగా మనం ప్రమాదాన్నే గుర్తిస్తాము కానీ మేలును కాదు. పెరుగు తింటున్నప్పుడల్లా మనం ఈస్ట్‌ బ్యాక్టీరియాను తలుచుకోము. ఏ దగ్గో, జ్వరమో వస్తే అందుకు కారకమైన సూక్ష్మజీవుల గురించి ఆరా తీస్తాము. మొత్తానికి హానిచేసేవైనా, మేలు చేసేవైనా అవి ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి.
Do all bacteria spread from one to another in telugu,biological science, bactiria,virus facts,virus, how to spread virus, virus in telugu.

అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?

అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ? మహా భారతమ్లోని అనుశాసన పర్వం లో ఉన్న " శ్రీ విష్ను సహస్రనామ స్తోత్రం " లో విష్ణు నామ... thumbnail 1 summary
అన్నమయ్య ముద్ర అంటే ఏమిటి ? వివరించండి ?


మహా భారతమ్లోని అనుశాసన పర్వం లో ఉన్న " శ్రీ విష్ను సహస్రనామ స్తోత్రం " లో విష్ణు నామాల్లో " అన్నం " అనే నామం కూడా ఉన్నది . ఆ స్తోత్రాన్ని విష్ణు ఆలయాల్లో అర్చన కాలం లో అనుదినం పఠిస్తూ ఉంటారు . " అన్నం " విష్ణు నామము కనుక అన్నమయ్య తల్లిదండ్రులు తమ కుమారునికి ఆ పేరు పెట్టారని ఆయన మనుమడు తాళ్ళపాక చిన్నన్న తన కావ్యము లో తెలిపాడు . " అన్నం " బ్రహ్మానికి పేరు గనుక అన్నమయ్యకు ఆ పేరు పెట్టి ఉంటారని కొంతమంది పండితుల భావన .

రోజుకొక సంకీర్తన తక్కువ కాకుండా తన జీవిత పర్యంతము శ్రీవేంకటేశ్వర స్వామికి 32 వేల సంకీర్తనా సుమాలు అర్పించిన అన్నమాచార్యులవారు స్వామి ఆదేశానుసారము తెలుగు , ద్రవిడ , కన్నడ (ఆంధ్ర , తమిళ , కర్ణాటక ) దేశాలలో విస్తారము గా సంచరించాడు . మార్గమధ్యములో వివిధ దేవతా మూర్తుల ఆలయాల్ని దర్శించడం జరిగినప్పుడు ఆయన ఆమూర్తులను స్తుతిసతూ వరాసిన సంకీర్తనల్లో కూడా వీరి చరణము లో ఆ యా దేవత మూర్తులకు - శ్రీ వేంకటేశ్వర స్వామికి అభేదం చూపుతూ విధగా సామి పేరు ప్రస్తావించేవాడు . అలా శ్రీవేంకటేశ్వర నామం అన్నమాచార్యులవారి కీర్తనల్లో " ముద్ర" గా సర్వత్రా కనిపిస్తుంది . ఒక సంకీర్తన అన్నమాచార్యుల వారిదా? కాదా? అని తెలుసుకోవాలంటే ఈ " ముద్ర " యే ఆధారము.
annamaya,annamayya, annamaiah story,annamayya mudra in telugu,annamayya facts,annamayya mudra story.

Potasium cyanide cause death..why, పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?

Potasium cyanide cause death..why, పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు? పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మంద... thumbnail 1 summary
Potasium cyanide cause death..why, పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?


పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండ��� ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రస��యనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది.

ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ��ంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.

Potasium cyanide cause death..why,Potasium cyanide cause death..why in telugu,Potasium cyanide, facts about Potasium cyanide, Potasium cyanide death.

Longest Train history, అతి పొడవైన రైలు బండి సంగతేమిటి?

Longest Train history, అతి పొడవైన రైలు బండి సంగతేమిటి? ప్రపంచంలో వేలాది రైళ్లు... అన్నింటిలో అతి పొడవైనది ఏది? అతి బరువైనది ఏది? ఈ ర... thumbnail 1 summary
Longest Train history, అతి పొడవైన రైలు బండి సంగతేమిటి?



ప్రపంచంలో వేలాది రైళ్లు... అన్నింటిలో అతి పొడవైనది ఏది? అతి బరువైనది ఏది? ఈ రెండు రికార్డులూ ఒక రైలువే! చుక్‌చుక్‌మంటూ రైలు పరిగెడుతుంటే ఎప్పుడైనా పెట్టెలు లెక్కపెట్టారా? అలా లెక్కపెట్టడం సరదాగానే ఉంటుంది కానీ, అన్ని రైళ్లకీ కాదు. ఆస్ట్రేలియాలోని ఓ రైలు పెట్టెలు లెక్కపెట్టాలంటే విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అతి పొడవైనదిగా గిన్నెస్‌ రికార్డు సాధించినది మరి. దీనికి అమర్చిన పెట్టెలెన్నో తెలుసా? 682. మీరు చూసే ఏ రైలుకైనా ఇంజిన్‌ ఒకటే ఉంటుంది. కొన్నింటికైతే రెండు కూడా ఉంటాయి. మరి ఈ పొడవైన రైలుకెన్ని ఇంజిన్లో చెప్పగలరా? ఎనిమిది! మరి అన్ని వందల పెట్టెల్ని లాగాలంటే ఇన్ని ఇంజిన్లు ఉండద్దేంటి?! ఇంజిన్లు, పెట్టెలు అన్నీ కలిపి చూస్తే ఈ రైలు ఎంత పొడవుంటుందో ఊహించగలరా? ఏకంగా 7.4 కిలోమీటర్లు! ఈ రైలు మొత్తాన్ని బరువు తూస్తే అది ఏకంగా 9,97,32,000 కిలోల బరువుంది! అందుకే పొడవైన, బరువైన రైలుగా రెండు రికార్డులు కొట్టేసింది.

ఆస్ట్రేలియాలోని అతి పెద్ద ఉక్కు సంస్థ వాళ్లు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001లో తయారుచేయించారు. దీని వల్ల వాళ్లు ఒకేసారి 82,000 టన్నుల ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డు మాత్రం అలాగే ఉంది.

తరువాత అదే ఉక్కు సంస్థ మరో రైలుని తయారు చేసింది. అది సుమారు 72,191 టన్నుల బరువుతో 5.8 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిపెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంత కాలం నడిపి ఆపేశారు.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అతి పొడవైనదిగా పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్లే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతి రోజు ముడి ఇనుమును 700 కిలోమీటర్ల దూరానికి చుక్‌చుక్‌మని తరలిస్తూ తిరుగుతోంది. దీనికుండే 200 వ్యాగన్లను లాగడానికి 4 ఇంజిన్లను వాడుతున్నారు. ఒక్కో వ్యాగన్‌లో 84 టన్నుల ముడి ఇనుము పడుతుంది. మీకు తెలుసా?

*ప్యాసింజర్‌ రైళ్లలో అతి పొడవైన రికార్డు నెదర్లాండ్‌లోని రైలుది. 60 బోగీలతో నిర్మించిన దీనిని 1989లో నడిపి ఆపై ఆపేశారు.

* ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు చైనాలోని షాంగై మ్యాగ్లేవ్‌ రైలు. ఇది గంటకి 431 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.

* మనదేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు న్యూఢిల్లీ నుంచి భోపాల్‌ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. గంటకి 150 కిలోమీటర్ల వేగం దీనిది.

Train facts,Longest train in world,the longest train,indian trains,longest train in world telugu.

Ultrasonic sounds, అతిధ్వనులంటే ఏంటి?

Ultrasonic sounds, అతిధ్వనులంటే ఏంటి? శబ్దాలను హెర్జ్‌ (Hertz)లో కొలుస్తారని తెలుసుకదా? ఇలా 20 నుంచి 20,000 హెర్జ్‌ల స్థాయిలో ఉండే శబ... thumbnail 1 summary
Ultrasonic sounds, అతిధ్వనులంటే ఏంటి?


శబ్దాలను హెర్జ్‌ (Hertz)లో కొలుస్తారని తెలుసుకదా? ఇలా 20 నుంచి 20,000 హెర్జ్‌ల స్థాయిలో ఉండే శబ్దాలనే మన చెవి వినగలుగుతుంది. 20,000 హెర్జ్‌లకు ఎక్కువైన శబ్దాలను 'అతి ధ్వనులు' (ultrasonic sounds) అంటారు. ఏదైనా వస్తువు సెకనుకు 20,000 కంటే ఎక్కువ కంపనాలకు గురైనప్పుడే అతి ధ్వనులు ఏర్పడుతాయి.

వీటిని క్వార్ట్జ్‌ (quartz) లేక పింగాణీ (ceramic) లాంటి పదార్థాల గుండా ఏకాంతర విద్యుత్‌ (AC)ని ప్రవహింప చేయడం ద్వారా గానీ, యాంత్రిక, అయస్కాంత విధానాల ద్వారాగానీ పుట్టిస్తారు. 1890లో పియర్‌ క్యూరీ అనే శాస్త్రజ్ఞుడు ఆవిష్కరించిన అతి ధ్వనులను, రెండో ప్రపంచయుద్ధంలో జలాంతర్గాముల ఉనికిని కనిపెట్టడానికి ఉపయోగించారు.

దేహంలో ట్యూమర్లు, కిడ్నీ, లివర్‌ లాంటి భాగాల్లోని లోపాలను కనిపెట్టడంలో, గర్భస్థ శిశువు పెరుగుదలను కనుగొనడంలో, టంగ్‌స్టన్‌ లాంటి దృఢమైన లోహాలను కోయడంలో, వివిధ పరికారాల లోపలి భాగాల్లో కంటికి కనబడని పగుళ్లను కనుగొనడంలో, యంత్రభాగాలను, సర్జరీ పరికరాలను పరిశుభ్రం చేయడంలో రకరకాలుగా అతిధ్వనులు ఉపయోగపడతాయి.

Ultrasonic sounds,Ultrasonic sounds in telugu,piarycury ultrasonic sounds.

What is matter, How many types, పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి?

What is matter, How many types, పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి? పరమాణువులు కలిసి అణువులు గా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి పదార్ధం... thumbnail 1 summary
What is matter, How many types, పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి?


పరమాణువులు కలిసి అణువులు గా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి పదార్ధం ను ఏర్పరుచుతాయి. విశ్వము లో అన్నిరకాల పదార్ధాలు (సజీవ , నిర్జీవ ) సూక్ష్మమైన అణువులతో , ఈ అణువులు అంతకంటే సూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమై ఉంటాయి. అంటే పదార్ధాన్ని విడగొడితే అణువులు , వీటిని విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి.

దాల్టన్‌ సిద్ధాంతము ప్రకారము పదార్ధములో విభజించడానికి వీలుకాని భాగమే ప్రమాణువు (sub-atomic particle). లాటిన్‌ భాషలో ' atom ' అంటే " విభజించడానికి వీలుకానిది " అని అర్ధము ... కానీ ఆతర్వాత వచ్చిన వివిధ ప్రతిపాదనల వల్ల పదార్ధములో అతిచిన్న భాగము అణువు , పరమాణువు లు కాదని , ఇందులో కుడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలున్నాయని గుర్తించారు. వీటినే ప్రాధమిక కణాలు అంటారు . అవి :

* ఎలక్ ట్రాన్‌ -electron(e-),
* ప్రోటాన్‌-proton(p+),
* న్యూట్రాన్‌- neutron(n^0).

* పదార్ధము(matter): -->అణువులు -->పరమాణువులు -->ఎలక్ట్రాన్ +‌-->న్యూట్రాన్‌ +-->ప్రోటాన్‌.

* అణువులు - Atoms : ఇవి స్థిరమైనవి . రసాయనికముగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.

* ప్రమాణువు - sub-atomic particles : ఇవి అస్థిరమైనవి . స్థిరత్వముకోసం రసాయనిక చర్యలో పాల్గొంటాయి కాబట్టి ఇవి చురుకైనవి . అస్థిరమైన పరమాణువులు స్థిరమైన అనువులుగా మారుతాయి. ఉదా: H(sub- atomic particles)+H(sub-atomic particles)---->H2 (atom). ఈ విధముగా పరమాణువులన్నీ కలిసి అణువులను , ఈ అణువులన్నీ కలిసి పదార్ధాన్ని ఏర్పరుస్తాయి.

పదార్ధము - రకాలు :

అణువుల మధ్య ఉండే అంతర్గత ఆకర్షణ బలాలను ఆధారము చేసుకొని పదార్ధాలను వాటి స్థితిని బట్టి 3(మూడు)రకాలుగా విభజించవచ్చును.

1. ఘన పదార్ధాలు(s) : ఈ రకమైన పదార్ధాల్లొని అణువుల మద్య ఆకర్షణ బలాలు బలముగా ఉంటాయి. వీటికి నిర్ధిష్టమైన ఆకృతి వుంటుంది . ఉదా: ఇసుక , ఉప్పు .

2. ద్రవ పదార్ధాలు(L) : ద్రవ పదార్ధాలలోని అణువులు మధ్య అంతర్గత ఆకర్షణ బలాలు బలహీనము గా ఉంటాయి. వీటికి నియమితమైన ఆకారము లేదు . ఇవి స్థిరమైన ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఉదా : నీరు , పాలు ,

3. వాయు పదార్ధాలు(g) : వాయు పదార్ధములోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు అతి బలహీనముగా ఉంటాయి. అణువులు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి క్రమరహిత చలనము ఉంటుంది. ఉదా : గాలిలో ఆక్షిజన్‌ (O2) వాయువు , కార్బనండయాక్షైడ్ (CO2) వాయువు .

కేంద్రము (కణిక) - nucleus.
పదార్ధము - matter.

What is matter, How many types, What is matter, How many types,  in telugu, physical science,chemistry,science facts,types of matter in telugu.

Who invented Atombomb, అణుబాంబు కనిపెట్టిందెవరు ?

Who invented Atombomb, అణుబాంబు కనిపెట్టిందెవరు ? అణుబాంబు పరిశోధనలు 1945 లో ప్రారంభమై , రెండవ ప్రపంచ యుద్ధకాలములో " ఒప్పెన్‌ హైమర... thumbnail 1 summary
Who invented Atombomb, అణుబాంబు కనిపెట్టిందెవరు ?


అణుబాంబు పరిశోధనలు 1945 లో ప్రారంభమై , రెండవ ప్రపంచ యుద్ధకాలములో " ఒప్పెన్‌ హైమర్ " అనే అమెరికన్‌ శాస్త్రజ్ఞుడి పర్యవేసణలో మెక్సికో ప్రాంతాల పరిశోధన్లు పూర్తయి 1945 లో కార్యరూపము దాల్చిందని ... అణుబాంబుని 1945 ఆగష్ట్ 06 న హిరోషిమా మీద , ఆగష్ట్ 09 న నాగసాకీ మీద వేసారు . 60 సం.లు దాటినా ఆ దారుణ పరిణామాలు మానవాళి ఇంకా మర్చిపోలేదు . నాగషాకీ , హిరోషిమా ల్లో జరిగిన ఘోర నరమేధం ఈ శాస్త్రజ్ఞుడు ఊహించని రీతిలో జరగడం చేత పశ్చాత్తాప పడి , భగవద్గీత తో భారతీయ వేదాంతం లో ఓదార్పు పొందాడట. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది.
Who invented Atombomb,oppen himar invented atom bomb, atom bomb nagasa,hiroshima.

What about Kudzu creeper plant, అడవితీగ కుడ్జూ సంగతేమిటి?

What about Kudzu creeper plant, అడవితీగ కుడ్జూ సంగతేమిటి? చైనాలో పుట్టింది... జపాన్‌లో పెరిగింది... అమెరికా చేరింది... హడలగొడుతోంది! ఇ... thumbnail 1 summary
What about Kudzu creeper plant, అడవితీగ కుడ్జూ సంగతేమిటి?


చైనాలో పుట్టింది... జపాన్‌లో పెరిగింది... అమెరికా చేరింది... హడలగొడుతోంది! ఇంతకీ ఏమిటి? ఓ అడవి తీగ! కొన్నేళ్లుగా వేలాది మంది ఒకే పని మీద ఉన్నారు. ఆ పని కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. ఆ పనేంటో తెలుసా? ఓ మొక్కను పీకెయ్యడం! ఇదంతా జరుగుతున్నది అగ్రరాజ్యమైన అమెరికాలో! అది మామూలు మొక్క కాదు! అనేక ప్రాంతాల్లో అల్లుకుపోతోంది! ఎంతో నష్టానికి కారణమవుతోంది. ఆ అడవితీగ పేరు కుడ్జూ (Kudzu).ఇది ఎంత వేగంగా పెరుగుతోందంటే, ఏడాదిలో లక్షన్నర ఎకరాల్లో అల్లుకుపోయింది. ఇలా ఇప్పటికి 70 లక్షల ఎకరాల్ని ఆక్రమించేసింది.

ఈ అడవితీగ కరెంటు స్తంభాలు, ఇళ్లు, ప్రహారీ గోడలు అన్నింటి మీదకీ పాకేస్తోంది. దాంతో విద్యుత్‌ సరఫరాకి అంతరాయం ఏర్పడుతోంది. ఇక అడవుల సంగతి చెప్పక్కర్లేదు చెట్ల మీద పందిరిలా అల్లుకుపోతుంటే ఆ ప్రాంతమంతా చీకటిమయమైపోతోంది. దీని వల్ల చాలా మొక్కలు సూర్యరశ్మి తగలక చనిపోతున్నాయి. అసలివి ఇంత త్వరగా ఎదగడానికి సహకరిస్తున్నదేంటో తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు 18 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఆ మొక్కలో ఉన్న ఓ ఔషధమే కారణమ ని తెలిసింది. దానిని ఎలా నియంత్రించాలో తెలుసుకునేందుకు నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నారు.

నిజానికి ఈ మొక్కకి, అమెరికాకి సంబంధమే లేదు. అమెరికా నూరవ పుట్టిన రోజు ఉత్సవాల్లో దేశదేశాల భాగస్వామ్యాన్ని ఆమెరికా ఆహ్వానించింది. ఆ సందర్భంగా జపాన్‌ వాళ్లు తమ దేశంలోని అందమైన మొక్కల్ని ప్రదర్శించారు. పెద్ద ఆకులతో, అందమైన పూలతో ఉన్న కుడ్జూ లతలు అందర్నీ ఆకర్షించాయి. చాలా మంది వీటిని కొని పెంచడం మొదలు పెట్టారు. పశువులకు ఆహారంగా రైతులు పొలాల్లో నాటారు. ఇప్పుడు అమెరికా వీటిని కలుపు మొక్కల జాబితాలో పెట్టింది. ఈ మొక్క పుట్టిల్లు చైనా అని చెపుతారు.

What about Kudzu creeper plant,What about Kudzu creeper plant, in telugu,What about Kudzu creeper plant,What about Kudzu creeper plant secrets,What about Kudzu creeper plant, facts.

అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి?

అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి? భూమిపై ప్రభావశీలమైన అగ్ని పర్వతాలు 600 వరకూ ఉన్నా... thumbnail 1 summary
అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి?

భూమిపై ప్రభావశీలమైన అగ్ని పర్వతాలు 600 వరకూ ఉన్నాయి. అవి విస్ఫోటనం చెందినపుడు వెదజల్లే అత్యధిక ఉష్ణోగ్రతగల లావా ప్రవాహం, భగభగమండే శిలలు ఆ పర్వత ప్రాంతాలనే కాకుండా వాటికి దూరంగా ఉండే ప్రదేశాలకు కూడా హాని కలిగిస్తాయి. అగ్ని పర్వత పేలుళ్లలో వాతావరణంలోకి టన్నుల కొలదీ గంధకం, బూడిద వెదజల్లినట్టవుతుంది. ఈ పదార్థాలు గాలుల ద్వారా భూగోళమంతా వ్యాపించి సూర్యకిరణాలు ప్రసరించకుండా అడ్డుపడడంతో అగ్ని పర్వతం పేలిన చాలా సంవత్సరాల వరకూ భూమిపై చల్లని వాతావరణం అలుముకొంటుంది.

ఇక రోదసీ నుంచి భూమిపైకి పడే ఉల్కల వల్ల ప్రమాదం ఆ ఉల్క (meteorite)పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఉల్కాపాతం, అగ్ని పర్వత పేలుడు ఈ రెండింటివల్ల భూవాతావరణంలో దుమ్ము, ధూళి, గాలి తుంపరలు అలుముకోవడంతో 'భౌగోళిక చల్లదనం' అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎటొచ్చీ ఎక్కువ పరిమాణంగల ఉల్క భూమిని ఢీకొంటే కలిగే ప్రమాదం అగ్ని పర్వత పేలుడు కన్నా ఎక్కువ. అతి పెద్ద ఉల్కాపాతం భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్ల సంతతి భూమిపై అంతమయ్యింది. కానీ ఉల్కాపాతం అరుదుగా జరుగుతుంది. అదే తరచూ జరిగే అగ్ని పర్వత పేలుళ్లు ఎప్పుడూ భూవాతావరణానికి ప్రమాదకరమే.
volcano facts,volcano effects.

How do we get water in Fridge, అక్కడి నీరు ఎక్కడిది?

How do we get water in Fridge, అక్కడి నీరు ఎక్కడిది? మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నై... thumbnail 1 summary
How do we get water in Fridge, అక్కడి నీరు ఎక్కడిది?


మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌లాంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందని చదువుకుని ఉంటారు. మనం తలుపులు తీసినప్పుడల్లా గాలి లోపలికి చొరబడి డీప్‌ఫ్రీజర్‌కి తగులుతూ ఉంటుంది. ఆ గాలిలోని నీటి ఆవిరి అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతకి గురై క్రమేణా మంచు పొరల్లాగా మారుతుంటుంది. ఫ్రిజ్‌ లోపల చల్లని పరిస్థితుల్లో పీడనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే తలుపులు తీసినప్పుడల్లా బయటి గాలి వేగంగా లోపలికి చొరబడుతుంది.

Fridge facts,How do we get water in Fridge, about fridge,How do we get water in Fridge in telugu.

Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం?

Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం? అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసు... thumbnail 1 summary
Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం?


అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆసుపత్రిక�� తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ట్రాఫిక్‌ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. ఒకటి: ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్‌ మోగించడం. రెండు: రాత్రయినా, పగలైనా బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును వాహనం పైన ఏర్పాటు చేస్తారు. మూడు: అంబులెన్స్‌ వాహనం మీద అక్షరాలను దానికి ముందున్న వ���హనదారులు గుర్తించేలా రాయడం. రోడ్డు మీద వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి 'రియర్‌ వ్యూ మిర్రర్‌' అనే చిన్న అద్దమొకటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా చూసినప్పు���ు అంబులెన్స్‌ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడాలంటే వాటిని తిరగేసి రాయాలి. అందుకే అలా రాస్తారు.

Internet, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?

Internet, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? ప్రపంచ వ్యాప్తం గా ఉండే కంప్యూటర్లనన్నింటినీ కలిపే వ్యవ స్థనే 'ఇంటర్నెట్‌-Internet' ... thumbnail 1 summary
Internet, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?


ప్రపంచ వ్యాప్తం గా ఉండే కంప్యూటర్లనన్నింటినీ కలిపే వ్యవ స్థనే 'ఇంటర్నెట్‌-Internet' అంటారు. దీనినే తెలుగులో 'అంతర్జాలం' అని సంబోధిస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్ వర్క్ లను కలిపే నెట్ వర్క్. ఈ వ్యవస్తలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో Internet అని రాస్తున్నప్పుడు మొదటి అక్షరం అయిన "I"ని ఎల్లప్పుడు కేపిటల్ లెటర్ గానే రాయవలెను. .

1969 సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగం అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్స అయిన 'ఆర్పా' (ఏఆర్‌ పిఏ) లో తొలిసారిగా ఇంటర్నెట్‌ సృష్టించబడింది. తర్వాత 1990 సంవత్సరంలో టిమ్‌ బెర్నెల్స్‌ లీ అనే శాస్త్రవేత్త స్విట్జర్లాండ్‌ లోని సెర్న్‌ (సిఇఆర్‌ఎన్‌) వద్ద 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌'ను సృష్టించాడు. దీనినే డబ్ల్యు, డబ్ల్యు. డబ్ల్యు.డబ్ల్యు అని అంటారు. ప్రస్తుతం ఇంట ర్నెట్‌ను మనం సర్వీస్‌ ప్రొవైడర్లకు కొంత మొత్తం డబ్బును చెల్లించి ఇళ్లల్లోనూ, కార్యా లయాల్లోనూ వాడుకోవచ్చును. ఇలా ప్రపం చంలోని కంప్యూటర్లను అన్నింటినీ కలిపే వ్యవస్థనే మనం నేడు 'ఇంటర్నెట్‌' అని పిలు చుకుంటున్నాము.

ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒక దానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్‌కు అనుసంధాన మైన ప్రతి కంప్యూటర్‌ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీనినే 'ఐపీ అడ్రస్‌' అని పిలు స్తుంటారు. ఇంటర్నెట్‌లోని సందేశాలన్నీ ఈ ఐపి చిరునామా ఆధారంగానే పంపబడతాయి.ఈ వ్యవస్థలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి .
1.Client computer(మన కంప్యూటర్ ) ,
2.Browser(అనుసందానము చేసే సాప్ట్ వేర్)
3.Server computer(మనకు సందేశాలు పంపే కంప్యూటర్).ఈ సూత్రాన్నే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు.

ఇందులో ఏఒక్కటి లేకపోయినా ఈ పక్రియ పనిచేయదు . ఇక ఈ ఇంటర్నెట్‌ ద్వారా మనం ఎన్నో పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు. పాతకాలంలో ఉత్తరాలు రాసుకునేవారు. అవి రెండు రోజులకో, మూడు రోజులకో చేరేవి. అలా మనం ఉత్తరం రాసినవారు మనకు తిరిగి జవాబివ్వాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టేది. కానీ ఇప్పుడాసమస్య లేదు. సమాచారాన్నంత టినీ కంప్యూటర్ల సహాయంతో మనం క్షణాల్లో చేరవేయాలనుకున్న వారికి చేరవేయవచ్చు. ఇంట్లోనే కూర్చుని మార్కెటింగ్‌, షాపింగ్‌ చేయవచ్చు. సినిమా టిక్కెట్లు,రైల్వే టిక్కెట్లు బుక చేసుకోవచ్చు.

e-మెయిల్‌ (ఎలక్ట్రానిక మెయిల్‌) ద్వారా మన క్షేమ సమాచారాలను దేశ విదేశాలలో ఉన్న బంధువులకు నిముషాల్లో పంపవచ్చు. అలాగే ఇంటర్నెట్‌ సౌకర్యం ద్వారా మన కంప్యూటర్‌కు వెబ్‌ కెమెరాను అమర్చుకొని దేశ విదేశాలలో ఉన్న స్నేహితులతోనో, బంధువులతోనో సంభాషించవచ్చు. ఈ వెబ్‌ కెమెరాను మన కంప్యూటర్‌కు సంధించడం వల్ల మనం నెట్‌ ద్వారా మాట్లాడేటపðడు వారు మనకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై, (వారికి వెబ్‌ కెమెరా ఉన్నట్లయితేనే) మన ముందు నిలబడి మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. అలాగే కొత్త కొత్త వారితో 'ఛాటింగ్‌' చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల మనం ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా (వారు మనకు పరిచయం లేకున్నా) గంటలతరబడి బాతాఖానీ కొట్టవచ్చు. ఇక ఈ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మీరు కలిగి వుంటే లైబ్రరీకి వెళ్ళి దినపత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్నిటినీ మనం ఇందులోనే చదివి విషయసేకరణ చేయవచ్చు. మనం కోరుకున్న జిల్లా వార్తలను కూడా దినపత్రిక వెబ్‌సైట్లను దర్శించి మనం తెలుసుకోవచ్చు. ఇందుకోసం 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌' ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో వెబ్‌సైటులు, బ్లాగులు లాంటి అనేక సౌకర్యాలుంటాయి. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఈ-మెయిల్స్‌నే. ఇందులో సమాచారాన్ని పంపవచ్చు, అందుకోవచ్చు. ఇపðడు ఇంటర్నెట్‌లో అన్ని భాషల్లో ప్రత్యేక వెబ్‌ సైట్లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీ పుణ్యమా అని ఇంటర్నెట్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయి. అలాగే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే స్థాయిలో ఉండటం వల్ల దీనిని సద్వినియోగానికి ఉపయోగించాలి. అందుకనే పిల్లలు నెట్‌ ముందు గంటలతరబడి కూర్చుని వుంటే పెద్దలు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం శ్రేయస్కరం. వాళ్ళు నెట్‌ను ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుదే! ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే ప్రారంభంలోనే వారికి తగు సలహాలనిచ్చి ఎడ్యుకేట్‌ చెయ్యాలి. గంటల తరబడి నెట్‌ ముందు కూర్చునేవారు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఎక్కువగా సందర్శించేవారు గుండెజబ్బులు, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలుకూడా ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

అందుకే బాలలూ! ఇంటర్నెట్‌ వల్ల లాభనష్టాలు సమంగా ఉన్నాయి. మీరు దానిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి మీ భవితలను బంగారు మయం చేసుకోవచ్చు. పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించవచ్చు. మీ సబ్జెక్ట నాలెడ్జిని ఇంప్రూవ్‌ చేసుకునేందుకుకూడా ఇంటర్నెట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలా లాభనష్టాలు కలయిక అయిన ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేదాన్ని బట్టి మనకి ఫలితాలు లభిస్తాయి. మీరు ఈ ఇంటర్నెట్‌ ద్వారా మంచి విజ్ఞానాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కదూ!

అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?

అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి? అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉ... thumbnail 1 summary
అంతరిక్ష వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధరిస్తాయి?



అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపైనే కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వం (Gravity) పై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువులేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు, గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా, సమానంగా పనిచేయడమే. భూమి తొలుత ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు అప్పటికే రాతితో నిర్మితమయి ఉంటే, గురుత్వ బలంకన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువవడంతో 'ఆస్టరాయిడ్ల' లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమంలేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉంటాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘు గ్రహం 'సిరీస్‌' మంచి ఉదాహరణ.

తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళవస్తువులు కచ్చితమైన గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం (Elliptical form) కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి విషువద్రేఖ (Equator) దగ్గర ఎక్కువగా ఉండడంతో అక్కడ ఏర్పడిన ఉబ్బు వల్లనే.

Setellites won't burn-why, అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?

Setellites won't burn-why, అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం? రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్... thumbnail 1 summary
Setellites won't burn-why, అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?


రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్దీ కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అ���్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క ఉష్ణోగ్రత దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చేరుకుంటుంది.

అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే అది ఉల్కలా మం���ిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికా, సిలికాన్‌డై ఆక్సైడ్‌ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93 శాతం వరకు సచ్చిద్రత (porosity) అంటే అతి సన్నని రంధ్రాలను కలిగి ఉం��ాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినపుడు జనించే అత్యధిక ఉష్ణశక్తి, ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరో భాగానికి ప్రవహించదు. సిలికాన్‌ ఉష్ణ వ్యాకోచ ధర్మం (thermal expansion), ఉష్ణ వాహకత్వం (thermal conduction) అతి తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలు(perfect insulators) గా పనిచేస్తాయి.

సిలికా పలక అంచులను రెండు చేతులతో పట్టుకుని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసినా, ఆ ఉష్ణం పలకను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకల అంచులకు చేరుకోదన్నమాట. వీటివల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమి పైకి చేరుకోగలుగుతాయి.

How can light travel in the Space, అంతరిక్షంలో కాంతి ఎలా ప్రయాణిస్తుంది?

How can light travel in the Space, అంతరిక్షంలో కాంతి ఎలా ప్రయాణిస్తుంది? కాంతి ప్రయాణించాలంటే యానకం (medium) ఉండాలనుకోవడం తప్పు. శబ్దత... thumbnail 1 summary
How can light travel in the Space, అంతరిక్షంలో కాంతి ఎలా ప్రయాణిస్తుంది?



కాంతి ప్రయాణించాలంటే యానకం (medium) ఉండాలనుకోవడం తప్పు. శబ్దతరంగాలు, పాదార్థిక తరంగాల వంటివి ప్రయాణించాలంటే యానకం ఉండాలి. కానీ కాంతి ప్రయాణానికి అవసరం లేదు. ఎందుకంటే కాంతి స్వభావ రీత్యా విద్యుదయస్కాంత తరంగాల క్రమానుగమనం (Electro magnetic wave propagation). ఈ విధమైన తరంగాల గమనానికి యానకం అవసరం లేదు. నిజానికి శూన్యంలోని కాంతికి అత్యధిక వేగం ఉంది. విశ��వంలో ఈ వేగానికి (3X108 మీ/సె) మించి మరేదీ ప్రయాణించలేదు.

అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా? పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డపుడు అందులో కొన్ని వర్ణాల కాంతు... thumbnail 1 summary
అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తుందంటారు. నిజమేనా?

పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డపుడు అందులో కొన్ని వర్ణాల కాంతుల్ని ఆ పదార్థాలు శోషించుకుంటాయి. మిగిలిన కాంతి పరావర్తనం, వితరణం ద్వారా వివిధ దిశల్లో వెలువడుతుంది. ఇలా వెలువడే కాంతి ఏ రంగులో ఉంటుందో అదే రంగు ఆ వస్తువుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏయే పదార్థాలు, ఏయే కాంతుల్ని శోషించుకుంటాయి, ఏయే వర్ణాల్ని త్యజిస్తాయి అన్న విషయం ఆయా పదార్థాల రసాయనిక సంఘటనం మీద ఆధారపడుతుంది. అన్ని గ్రహాల ఉపరితలాల, లేదా ఆయా గ్రహాల వాతావరణాలు ఒకే విధమైన రసాయనిక సంఘటనతో లేవు.

కాబట్టి సౌర కాంతి వాటి మీద పడ్డపుడు అవి త్యజించే కాంతి ఏ వర్ణానిదన్న విషయం ఆయా గ్రహపు ఉపరితల రసాయనిక సంఘటనను బట్టి ఉంటుంది. ఆ పద్ధతిలో భూమి లేత నీలి రంగులో (మేఘాలు, సముద్రాల వల్ల), అంగారక గ్రహం నారింజ ఎరుపు రంగులో (అక్కడున్న ఐరన్‌ఆక్సైడ్‌ వల్ల), బృహస్పతి లేత పసుపు రంగులో (గంధక పదార్థం వల్ల), శని లేత నారింజ రంగులో (అమోనియా తదితర గంధక పదార్థాల వల్ల), యురేనస్‌, నెప్ట్యూన్లు లేత నీలం రంగులో (మీథేన్‌ వాయువు వల్ల) కనిపిస్తాయి.

space,space wit planet,planet colours in space.

How can we talk from space, అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడుతారు?

How can we talk from space, అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడుతారు? మీరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్దతరంగాలు మొదట విద్యుదయ... thumbnail 1 summary
How can we talk from space, అంతరిక్షం నుంచి ఎలా మాట్లాడుతారు?




మీరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్దతరంగాలు మొదట విద్యుదయస్కాంత తరంగాలు (electromagnetic waves)గా మారతాయి. వాటిని సెల్‌ఫోన్‌ కంపెనీ వాళ్లు తమ మైక్రోవేవ్‌ కారియర్‌ తరంగానికి జోడించి టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు. అవి అవతలి వైపు సెల్‌ఫోన్‌ను చేరుకోగానే అందులో తిరిగి శబ్ద తరంగాలుగా మారతాయి. సాధారణంగా మైక్రోవేవ్‌ తరంగాలు, రేడియో తరంగాలు, తక్కువ దూరాలకు పరారుణ (infra red) తరంగాలను వాడతారు. వీటి ప్రసారానికి వాతావరణం కానీ, పదార్థాలు కానీ అవసరం లేదు. నిజానికి శూన్యంలోనే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోని వ్యోమగామికి, భూమ్మీద ఉండే కేంద్రానికి మధ్య ఇలాగే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా సమాచారం బట్వాడా అవుతుంది.

How can we talk from space,How can we talk from space in telugu, space reaseach, talk in space, space communication,communication with space to earth.

Currency is not same all over the world.. why, అంతటా ఒకే కరెన్సీ ఉండదేం?

Currency is not same all over the world.. why, అంతటా ఒకే కరెన్సీ ఉండదేం? ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థి... thumbnail 1 summary
Currency is not same all over the world.. why, అంతటా ఒకే కరెన్సీ ఉండదేం?


ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం.

మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.

అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.

Currency is not same all over the world.. why,Currency is not same all over the world.. why in telugu,world currency, currency facts,currency in india.

Living possible on Mars, అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా?

Living possible on Mars, అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా? ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లల... thumbnail 1 summary
Living possible on Mars, అంగారకుడిపై ఆవాసం సాధ్యమేనా?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

అంగారకుడు (మార్స్‌) భూమికి దగ్గరగా ఉన్న ఓ గ్రహం. సూర్యునివైపు శుక్రగ్రహం, సూర్యునికి వ్యతిరేక దిశలో మార్స్‌ మన భూమికి సమీప గ్రహాలు. ఘనపరిమాణంలోనూ, ద్రవ్యరాశిపరంగానూ మన భూమిలో దాదాపు ఎనిమిదవ వంతు ఉన్న గ్రహం ఇది. ఆ గ్రహపు ఉపరితల పరిశోధనలలో అక్కడ గతంలో నదులు ఉన్న ఆనవాళ్లు కనబడ్డాయి. 1970 సంవత్సరంలో వైకింగ్‌, 2001లో ఆపర్ట్యూనిటీ రోవర్‌, 2012 క్యూరియాసిటీ రోవర్‌లతో ఎన్నో పరిశోధనలు చేశారు. మన ఇస్రో వారు కూడా 2013లో మంగళ్‌యాన్‌ పేరుతో MOM (mars orbiter mission)శకటాన్ని పంపి ఉన్నారు.

మార్స్‌ పరిభ్రమణ కాలం దాదాపు రెండు సంవత్సరాలు. దాని భ్రమణ కాలం దాదాపు 25 గంటలు. దాని వాతావరణంలో 96 శాతం కార్బన్‌డై ఆక్సైడ్‌ ఉన్నా, కొద్ది మోతాదులో నైట్రోజన్‌, ఆక్సిజన్లు ఉన్నాయి.

అంగారక గ్రహానికి రెండు ఉపగ్రహాలు (చంద్రుళ్లు) ఉన్నాయి. భూ వాతావరణానికి, భూగమన రాశులకు ఉష్ణోగ్రత స్థితులు అంగారక గ్రహంకన్నా దగ్గరగా మరే గ్రహానికి లేవు. కాబట్టి సౌరకుటుంబంలో గతంలోగానీ, భవిష్యత్తులోగానీ జీవానికి అనువైన గ్రహంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అది అంగారకుడిపైనేనని శాస్త్రవేత్తల అభిప్రాయం.

Living possible on Mars?,Living possible on Mars in telugu,mars palnet,mars history,living on mars,mars reasearch nasa.