Longest Train history, అతి పొడవైన రైలు బండి సంగతేమిటి?
ప్రపంచంలో వేలాది రైళ్లు... అన్నింటిలో అతి పొడవైనది ఏది? అతి బరువైనది ఏది? ఈ రెండు రికార్డులూ ఒక రైలువే! చుక్‌చుక్‌మంటూ రైలు పరిగెడుతుంటే ఎప్పుడైనా పెట్టెలు లెక్కపెట్టారా? అలా లెక్కపెట్టడం సరదాగానే ఉంటుంది కానీ, అన్ని రైళ్లకీ కాదు. ఆస్ట్రేలియాలోని ఓ రైలు పెట్టెలు లెక్కపెట్టాలంటే విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అతి పొడవైనదిగా గిన్నెస్ రికార్డు సాధించినది మరి. దీనికి అమర్చిన పెట్టెలెన్నో తెలుసా? 682. మీరు చూసే ఏ రైలుకైనా ఇంజిన్ ఒకటే ఉంటుంది. కొన్నింటికైతే రెండు కూడా ఉంటాయి. మరి ఈ పొడవైన రైలుకెన్ని ఇంజిన్లో చెప్పగలరా? ఎనిమిది! మరి అన్ని వందల పెట్టెల్ని లాగాలంటే ఇన్ని ఇంజిన్లు ఉండద్దేంటి?! ఇంజిన్లు, పెట్టెలు అన్నీ కలిపి చూస్తే ఈ రైలు ఎంత పొడవుంటుందో ఊహించగలరా? ఏకంగా 7.4 కిలోమీటర్లు! ఈ రైలు మొత్తాన్ని బరువు తూస్తే అది ఏకంగా 9,97,32,000 కిలోల బరువుంది! అందుకే పొడవైన, బరువైన రైలుగా రెండు రికార్డులు కొట్టేసింది.
ఆస్ట్రేలియాలోని అతి పెద్ద ఉక్కు సంస్థ వాళ్లు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001లో తయారుచేయించారు. దీని వల్ల వాళ్లు ఒకేసారి 82,000 టన్నుల ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డు మాత్రం అలాగే ఉంది.
తరువాత అదే ఉక్కు సంస్థ మరో రైలుని తయారు చేసింది. అది సుమారు 72,191 టన్నుల బరువుతో 5.8 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిపెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంత కాలం నడిపి ఆపేశారు.
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అతి పొడవైనదిగా పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్లే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతి రోజు ముడి ఇనుమును 700 కిలోమీటర్ల దూరానికి చుక్‌చుక్‌మని తరలిస్తూ తిరుగుతోంది. దీనికుండే 200 వ్యాగన్లను లాగడానికి 4 ఇంజిన్లను వాడుతున్నారు. ఒక్కో వ్యాగన్‌లో 84 టన్నుల ముడి ఇనుము పడుతుంది. మీకు తెలుసా?
*ప్యాసింజర్ రైళ్లలో అతి పొడవైన రికార్డు నెదర్లాండ్‌లోని రైలుది. 60 బోగీలతో నిర్మించిన దీనిని 1989లో నడిపి ఆపై ఆపేశారు.
* ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు చైనాలోని షాంగై మ్యాగ్లేవ్ రైలు. ఇది గంటకి 431 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.
* మనదేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు న్యూఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్. గంటకి 150 కిలోమీటర్ల వేగం దీనిది.
Train facts,Longest train in world,the longest train,indian trains,longest train in world telugu.
Powered by W3Teacher
No comments
Post a Comment