శబ్దాలను హెర్జ్ (Hertz)లో కొలుస్తారని తెలుసుకదా? ఇలా 20 నుంచి 20,000 హెర్జ్‌ల స్థాయిలో ఉండే శబ్దాలనే మన చెవి వినగలుగుతుంది. 20,000 హెర్జ్‌లకు ఎక్కువైన శబ్దాలను 'అతి ధ్వనులు' (ultrasonic sounds) అంటారు. ఏదైనా వస్తువు సెకనుకు 20,000 కంటే ఎక్కువ కంపనాలకు గురైనప్పుడే అతి ధ్వనులు ఏర్పడుతాయి.
వీటిని క్వార్ట్జ్ (quartz) లేక పింగాణీ (ceramic) లాంటి పదార్థాల గుండా ఏకాంతర విద్యుత్ (AC)ని ప్రవహింప చేయడం ద్వారా గానీ, యాంత్రిక, అయస్కాంత విధానాల ద్వారాగానీ పుట్టిస్తారు. 1890లో పియర్ క్యూరీ అనే శాస్త్రజ్ఞుడు ఆవిష్కరించిన అతి ధ్వనులను, రెండో ప్రపంచయుద్ధంలో జలాంతర్గాముల ఉనికిని కనిపెట్టడానికి ఉపయోగించారు.
దేహంలో ట్యూమర్లు, కిడ్నీ, లివర్ లాంటి భాగాల్లోని లోపాలను కనిపెట్టడంలో, గర్భస్థ శిశువు పెరుగుదలను కనుగొనడంలో, టంగ్‌స్టన్ లాంటి దృఢమైన లోహాలను కోయడంలో, వివిధ పరికారాల లోపలి భాగాల్లో కంటికి కనబడని పగుళ్లను కనుగొనడంలో, యంత్రభాగాలను, సర్జరీ పరికరాలను పరిశుభ్రం చేయడంలో రకరకాలుగా అతిధ్వనులు ఉపయోగపడతాయి.
Ultrasonic sounds,Ultrasonic sounds in telugu,piarycury ultrasonic sounds.
No comments
Post a Comment