There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?

There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు? చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల... thumbnail 1 summary
There are no hair growth on palm why, అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?


చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి. 
వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు. 

No comments

Post a Comment