Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం?

Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం? అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసు... thumbnail 1 summary
Letters write in reverse on Ambulence-Why, అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం?


అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆసుపత్రిక�� తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ట్రాఫిక్‌ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. ఒకటి: ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్‌ మోగించడం. రెండు: రాత్రయినా, పగలైనా బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును వాహనం పైన ఏర్పాటు చేస్తారు. మూడు: అంబులెన్స్‌ వాహనం మీద అక్షరాలను దానికి ముందున్న వ���హనదారులు గుర్తించేలా రాయడం. రోడ్డు మీద వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి 'రియర్‌ వ్యూ మిర్రర్‌' అనే చిన్న అద్దమొకటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా చూసినప్పు���ు అంబులెన్స్‌ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడాలంటే వాటిని తిరగేసి రాయాలి. అందుకే అలా రాస్తారు.

No comments

Post a Comment