What is matter, How many types, పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి?
పరమాణువులు కలిసి అణువులు గా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి పదార్ధం ను ఏర్పరుచుతాయి. విశ్వము లో అన్నిరకాల పదార్ధాలు (సజీవ , నిర్జీవ ) సూక్ష్మమైన అణువులతో , ఈ అణువులు అంతకంటే సూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమై ఉంటాయి. అంటే పదార్ధాన్ని విడగొడితే అణువులు , వీటిని విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి.
దాల్టన్ సిద్ధాంతము ప్రకారము పదార్ధములో విభజించడానికి వీలుకాని భాగమే ప్రమాణువు (sub-atomic particle). లాటిన్ భాషలో ' atom ' అంటే " విభజించడానికి వీలుకానిది " అని అర్ధము ... కానీ ఆతర్వాత వచ్చిన వివిధ ప్రతిపాదనల వల్ల పదార్ధములో అతిచిన్న భాగము అణువు , పరమాణువు లు కాదని , ఇందులో కుడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలున్నాయని గుర్తించారు. వీటినే ప్రాధమిక కణాలు అంటారు . అవి :
* ఎలక్ ట్రాన్ -electron(e-),
* ప్రోటాన్-proton(p+),
* న్యూట్రాన్- neutron(n^0).
* పదార్ధము(matter): -->అణువులు -->పరమాణువులు -->ఎలక్ట్రాన్ +-->న్యూట్రాన్ +-->ప్రోటాన్.
* అణువులు - Atoms : ఇవి స్థిరమైనవి . రసాయనికముగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.
* ప్రమాణువు - sub-atomic particles : ఇవి అస్థిరమైనవి . స్థిరత్వముకోసం రసాయనిక చర్యలో పాల్గొంటాయి కాబట్టి ఇవి చురుకైనవి . అస్థిరమైన పరమాణువులు స్థిరమైన అనువులుగా మారుతాయి. ఉదా: H(sub- atomic particles)+H(sub-atomic particles)---->H2 (atom). ఈ విధముగా పరమాణువులన్నీ కలిసి అణువులను , ఈ అణువులన్నీ కలిసి పదార్ధాన్ని ఏర్పరుస్తాయి.
పదార్ధము - రకాలు :
అణువుల మధ్య ఉండే అంతర్గత ఆకర్షణ బలాలను ఆధారము చేసుకొని పదార్ధాలను వాటి స్థితిని బట్టి 3(మూడు)రకాలుగా విభజించవచ్చును.
1. ఘన పదార్ధాలు(s) : ఈ రకమైన పదార్ధాల్లొని అణువుల మద్య ఆకర్షణ బలాలు బలముగా ఉంటాయి. వీటికి నిర్ధిష్టమైన ఆకృతి వుంటుంది . ఉదా: ఇసుక , ఉప్పు .
2. ద్రవ పదార్ధాలు(L) : ద్రవ పదార్ధాలలోని అణువులు మధ్య అంతర్గత ఆకర్షణ బలాలు బలహీనము గా ఉంటాయి. వీటికి నియమితమైన ఆకారము లేదు . ఇవి స్థిరమైన ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఉదా : నీరు , పాలు ,
3. వాయు పదార్ధాలు(g) : వాయు పదార్ధములోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు అతి బలహీనముగా ఉంటాయి. అణువులు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి క్రమరహిత చలనము ఉంటుంది. ఉదా : గాలిలో ఆక్షిజన్ (O2) వాయువు , కార్బనండయాక్షైడ్ (CO2) వాయువు .
కేంద్రము (కణిక) - nucleus.
పదార్ధము - matter.
What is matter, How many types, What is matter, How many types, in telugu, physical science,chemistry,science facts,types of matter in telugu.
Powered by W3Teacher
No comments
Post a Comment